హజారేకు ఏడు రోజుల రిమాండ్‌ :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యూఢిల్లీ : అవినీతిపై నిరసన దీక్షకు దిగకముందే అరెస్ట్‌ అయిన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. ఆయనని తీహార్ జైలుకు తరలించారు. హజారే దీక్షకు పోలీసులు షరతులు విధించడం, వాటిని ఆయన తిరస్కరించడంతో దీక్ష మొదలవ్వకముందే హజారేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హజారే అరెస్ట్‌కు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్‌ అయిన అన్నా హజారే పోలీసు ఆఫీసర్స్‌ మెస్‌లో కొద్దిసేపు ఉంచారు. ఆయన అక్కడే దీక్ష మొదలుపెట్టారు. తమ షరతులకు అంగీకరించకపోవడంతో ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చారు. కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు ఆయన్ను పంపింది.