మహేష్ బాబు సినిమాలో హన్సిక :సినీ జ్వాల తెలుగు:

Posted on

మహేష్, హన్సిక ల కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ లోటుని తీర్చాలని పూరి జగన్నాధ్ ఫిక్స్ అయ్యాడంటున్నారు. అయితే ఆమెను హీరోయిన్ గా కాకుండా ఆయన తీస్తున్న ది బిజెనెస్ మ్యాన్ లో ఐటం సాంగ్ కి ఒప్పించాడని తలుస్తోంది. తనను తెలుగు తెరకు దేశముదురుతో పరిచయం చేసిన పూరికి గురు భక్తితో హన్సిక ఓకే అందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా కాజల్ ఈ చిత్రంలో మహేష్ సరసన చేయనుంది.

ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్‌'. ఇంతవరకూ మహేష్ ‌బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన త్వరలో రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.