హైదరాబాద్: వైఎస్ మరణం అధిష్ఠానం కుట్ర అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం దీటుగా కౌంటర్ ఇస్తోంది. ప్రమాదానికి దారితీసిన హెలికాప్టర్ ఆలనాపాలనా చూసిన నాటి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ బ్రహ్మానందరెడ్డిపై ఎందుకు చర్య తీసుకోలేదంటూ జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాన్ని తిరగదోడాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా.. తదనంతర పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండు నెలల తర్వాత జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పి.శంకర్‌రావు మినహా మిగిలిన తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు అజెండా అంశాల్లో భాగంగా వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం.. తదనంతర అంశాలపై 'యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)'ను మంత్రి వర్గ సమావేశంలో అధికారులు ప్రవేశపెట్టారు. వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వైఎస్ లాంటి మహానేత మరణం విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడినా.. వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే బయటకు ఎలాంటి సంకేతాలు పంపుతాం' అని ఆవేశంగా ప్రశ్నించారు. 'వైఎస్ మరణానికి కాంగ్రెస్ అధిష్ఠానమే కుట్ర పన్నిందని ఆరోపిస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం తరఫు నుంచి కౌంటర్ అటాక్ లేకుంటే ఎలా? ఆయన (జగన్) తనకొక్కడికే రక్తసంబంధం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మాకు రక్తసంబంధం లేకున్నా మంచి అనుబంధం ఉంది. సీబీఐతో పాటు రెండు మూడు కమిటీలు ఇచ్చిన నివేదికల సారాంశాన్ని.. వాటిపై అధికారులు తీసుకున్న చర్యలను వివరించలేకపోతే ఎలా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ స్వయంగా నడుపుతున్న పత్రికలో హెలికాప్టర్ ప్రమాదంపై ఒక కథనం వచ్చిందన్నారు. దాన్ని చూడగానే ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ నాటి సీఎం రోశయ్యకు లేఖ రాశానని చెప్పారు. సీబీఐతో పాటు.. మరి రెండు కమిటీలు అప్పటి అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టాయన్నారు. ఏవియేషన్ కార్పొరేషన్ అప్పటి ఎండీ బ్రహ్మానందరెడ్డి తీరును అన్ని కమిటీలు తప్పుబట్టాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసులు చేశాయని వివరించారు. అయినా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాతృసంస్థకు పంపేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు తప్పుచేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయని నిలదీశారు. ఈ సమయంలో మంత్రి రఘువీరారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నెలరోజుల్లోగా నాకు నివేదిక ఇవ్వండి' అని సీఎస్ ఎస్వీ ప్రసాద్‌ను సీఎం కిరణ్ ఆదేశించారు.