ఎనిమిదేళ్ళుగా ఎదురుచూస్తున్నా - ఎన్టీఆర్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఎనిమిదేళ్లుగా నేను, జగన్‌, అభిమానులు ఎదురుచూస్తోన్న సినిమా ఇది. మేమిద్దరం కలిశామంటే అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునే కథ దొరికింది అన్నారు ఎన్టీఆర్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయటానికి కమిటైన ఎన్టీఆర్ ఇలా స్పందించారు. 'ఆంధ్రావాలా' తరవాత ఎన్టీఆర్‌-పూరి జగన్నాథ్‌ కలయికలో వస్తున్న చిత్రమిదే. నటుడు బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే యేడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.ఇక ప్రాజెక్టు గురించి పూరీ మాట్లాడుతూ... ''ఇదో ప్రేమకథ. యాక్షన్‌తో పాటు అన్ని అంశాలూ ఉంటాయి. ఎన్టీఆర్‌ని మరో కోణంలో చూస్తారు అన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి' చిత్రం చేస్తున్నారు.అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా కంప్లీట్ చేస్తారు. ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఊసరివిల్లి చిత్రం దసరాకు విడుదల అవుతుందని మొదట ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ బట్టి చూస్తే అది డిసెంబర్ కి విడుదల అయ్యే వాతావరణం కనపడుతోంది. ఇక బోయపాటి శ్రీనుతో చేస్తున్న చురకత్తి చిత్రం వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. బోయపాటి సినిమాను ప్రక్కన పెట్టి మరీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఊసరివిల్లి చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు.