ఏకాభిప్రాయం ఎప్పటికీ కుద‌ర‌దు.. :CineJwala Telugu:

Posted on

రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం ఎప్పటికీ రాదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఆరోగ్యం సత్వరం కోలుకోవాలని కోరుతూ ఆయన ప్రత్యేకంగా యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా ఆరోగ్యం కోసం పూజలు చేయిస్తున్నామని , ఆమె త్వరగానే కోలుకుంటారని ఆయన అన్నారు. కాగా రెండువలే తొమ్మిది డిసెంబరు తొమ్మిది నాటి ప్రకటన వల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొందని తెలంగాణ గురించి ప్రస్తావించి అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం దాటవేసే ప్రకటన చేయడం కాకుండా, వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని కోరుతున్నామని హనుమంతరావు అన్నారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకోవలసింది సోనియాగాంధీనే కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. హనుమంతరావు తెలంగాణ కోరుతున్నప్పటికీ, రాజ్యసభ పదవికి రాజీనామా చేయలేదు. కేవలం కేశవరావు ఒక్కరే రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ నేపద్యంలో వి.హనుమంతరావు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచన ఇస్తున్నట్లున్నారు. సోనియాగాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు.