తెలంగాణ సిద్దాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర మితి అధినేత కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనకోసం దేనికైనా సిద్దమేనని ప్రకటించారు. కాగా మెదక్ ఎమ్.పి విజయశాంతి ,తదితర నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధించేవరకు విశ్రమించరాదని విజయశాంతి పిలుపు ఇచ్చారు.ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విషయంలో లైఫ్ టైమర్ అని కె.సిఆర్ అన్నారు. కొందరు పార్ట్ టైమర్స్ గా, కొందరు ఫుల్ టైమర్స్ గా ఉంటారని, ఆయన మాత్రం తెంగాణ ఉద్యమానికి లైఫ్ టైమర్ గా ఉన్నారని ఆయన ప్రశంసిచారు. తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభకు కూడా అంతటి అనారోగ్యంలో కూడా వచ్చారన్నారు. తెలంగాణ అంటే జయశంకర్ ఆత్మ, ఆయన ఆలోచన అంతా తెలంగాణనే అని ఆయన అన్నారు. కష్టాలలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించారని జయశంకర్ అన్నారు. జయశంకర్ లేకపోవడం వల్ల అత్యధిక నష్టం తనకే జరిగిందని కెసిఆర్ తెలిపారు. ఏ అంశంపైన అయినా ఇటే బోధపడేలా చెప్పగల మేధావి అని కెసిఆర్ అన్నారు.