రెండు రోజుల బంద్‌కి ముహూర్తం ఖ‌రారు :CineJwala Telugu:

Posted on

14 ఎఫ్ పై తెలంగాణ విద్యార్థీ జేఏసీ సమరం శంఖం మోగించింది. ఎస్సై రాత పరీక్షల కంటే ముందుగానే 14 ఎఫ్ ను తొలగించాలని ఇన్నాళ్లూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అయినా ఇంతవరకు 14 ఎఫ్ పై ఎలాంటి అనుకూల సమాచారం లేకపోవడంతో.. విద్యార్థీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 12 లోగా 14 ఎఫ్ తొలగించాలని విద్యార్థీ జేఏసీ డిమాండ్ చేసింది. ఒకవేళ 12 లోగా ప్రభుత్వం 14 ఎఫ్ ను తొలగించకపోతే.. 13, 14 తేదీల్లో తెలంగాణ బంద్ ను పాటించాలని పిలుపునిచ్చింది. అలాగే 16 న జాతీయ రహదారుల దిగ్బంధనం, 17 న కేజీ నుంచి పీజీ వరకు తరగతుల బహిష్కరించాలని నిర్ణయించింది. అలాగే ఈ నెల 18 న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలను కలుపుకుని.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థీ జేఏసీ ప్రకటించింది.