మన దేశంలో పొలిటికల్ పవర్ ఉన్నోడి పంతమే నెగ్గుతుందని మరోసారి తేట తెల్లమైంది. ఈ పొలిటికల్ పవర్ ను ఉపయోగించి లీడర్లు చేసే పనులు అన్నీ ఇన్నీ కాదు. దీన్ని చాలా తక్కువ మంది మంచి పనులు చేయడానికి ఉపయోగించుకుంటుంటే...ఎక్కువ మంది దీన్ని తమ స్వార్థ, రాజకీయ ప్రయోజనాలు కాపాడు కోవడానికి, పంతం నెగ్గించుకోవడానికి, అక్రమ సంపాదన కోసం పొలిటికల్ పవర్ ను వాడుకుంటున్నారు. అందుకు మన దేశంలో వెలుగు చూసిన కోటానుకోట్ల కుంభ కోణాలు, అక్రమాలు, అన్యాయాలే తార్కాణం.
తాజాగా...సినిమా రంగంపై కూడా రాజకీయ నాయకులు పవర్ పాలిటిక్స్ ప్లే చేయడం మొదలు పెట్టారు. తమకు వ్యతిరేకంగా ఉన్న సినిమాలను, తమ రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసే సినిమాలను అడ్డు కోవానికి ప్రయత్నిస్తున్నారు. ‘ఆరక్షణ్’ సినిమా విడుదలపై మాయావతి ప్రభుత్వం విధించిన నిషేదమే ఇందుకు నిదర్శనం.
మన దేశ రాజకీయాలు ప్రముఖంగా కులాలు, మతాల చుట్టే తిరుగుతున్నాయనేది కాదనలేని వాస్తవం. కుల పరమైన రిజర్వేషన్లు మన రాజకీయ, విద్యా వ్యవస్థలో కీలకంగా మారాయి. రాజకీయ అవకాశాలను, ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయింపును నిర్ణయించేది రిజర్వేషన్ల నిష్పత్తే. ఈ అంశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుని డర్జీ పాలిటిక్స్ చేసే లీడర్లు చాలా మందే ఉన్నారు. దీన్నీ బేస్ చేసుకుని ‘ఆరక్షణ్’ సినిమా రూపొందించారు దర్శకుడు ప్రకాష్ ఝా. రిజర్వేషన్ కల్పించడం వెనక అసలు ఉద్దేశ్యం నెరవేరుతుందా? రిజర్వేషన్ వలన సమర్థులకు, మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? అనే అంశాన్ని సినిమాలో ప్రధానంగా చర్చించారు. అమితాబ్, సైఫ్ లాంటి పెద్ద స్టార్లు ఉండటంతో సినిమా అందరినీ ఆకర్షిస్తోంది.
దీంతో...ఈ సినిమాపై రాజకీయ నాయకుల్లో ఆందోళన మొదలైంది. త్వరలో తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ సినిమా విడుదలైతే తేడాలొస్తాయని గ్రహించిన మాయావతి కొన్ని కారణాలను సాకుగా చూపి ఉత్తర ప్రదేశ్ లో ఆ సినిమా విడుదల కాకుండా నిషేదం విధంచింది. మాయావతి తరహాలోనే మరికొందరు రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.