మహేష్ ని తెగ పొగుడుతున్న వర్మ :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఎప్పుడూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే డిఫెరెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పూరి జగన్నాథ్ ఏం మంత్రం వేశాడో కానీ ఇటీవల అతను ఏ సినిమా తీసినా కానీ వర్మకి అదో క్లాసిక్ లా కనిపింస్తోంది. నేను నా రాక్షసి, బుడ్డా సినిమాల గురించి పొగిడి పొగిడి వదిలిపెట్టిన వర్మ ఇప్పడు మహేష్ బిజినెస్ మ్యాన్ పై ప్రశంసలు గుప్పించడం అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో సీన్లు చూశానంటూ మహేష్ ని, పూరిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.దూకుడుకి డబుల్ ఉంటుందని ఇటీవలే చెప్పిన వర్మ ఇప్పుడీ చిత్రం చేస్తున్న మహేష్, పూరిలకి పాదాభివందనం చేయాలని అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది నిజమో..అపద్దమో..వెటకారమో తేల్చుకోలేని వర్మ క్యారెక్టర్ కి జడిసి, అసలు అతను ఈ సినిమా ఊసెత్తకుండా ఉంటే బాగుంటుందని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు.