హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ తెరాసేనని చెప్పారు.ఉద్యమానికి విరామం మాత్రమే ఇచ్చామని చెప్పారు. మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తెలంగాణ సాధించుకుంటామన్నారు. పోలవరంపై విమర్శలు చూస్తుంటే పెద్ద కుట్రనే దాగి ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపారు.ఇదిలావుండగా, కేంద్ర మంత్రి షెల్జాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ అయ్యారు. ఛార్మినార్ పునర్వైభవం కోసం నిధులు కేటాయించాలని షెల్జాకు వినతి పత్రం సమర్పించారు.