తెలంగాణ ప్రజలకు చీకటి రోజు: పొన్నం :సినీ జ్వాల తెలుగు:

Posted on

కరీంనగర్: నవంబర్ 1వ తేదీ తెలంగాణ ప్రజలకు చీకటి రోజు అని ఆందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను బహిష్కరించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.నవంబర్ 1వ తేదీ ఉత్సవాల్లో పాల్గొనబోమని తెలంగాణ మంత్రులు చెప్పడం మంచి సంకేతమని ఆయన మీడియా ప్రతినిదులతో  అన్నారు. ఏ తెలంగాణ బిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొనకూడదని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తున్న తెలంగాణ నాయకులు అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు వాటికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ స్థితిలో జిల్లాల్లో కలెక్టర్ల చేత పతాకావిష్కరణ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.