వాషింగ్టన్: శ్వేతసౌధం దీపావళి వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం శ్వేతసౌధంలోని ఎసెన్‌హోవర్ కార్యాలయం భవనంలో ఈ వేడుకలు జరుగుతాయి. నిరుడు దీపావళి పర్వదినం రోజు ఒబామ తన సతీమణి మిచెల్లీతో కలిసి ఇండియాలోనే ఉన్నారు. ముంబైలో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
జార్జి డబ్ల్యు బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే, దీపావళి వేడుకలకు హాజరయ్యే తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే కావడం విశేషం. శ్వేతసౌధం దీపావళి వేడుకల్లో పాల్గొనే తొలి అమెరికా అధ్యక్షుడు తానే కావడం గర్వంగా ఉందని, నిరుడు తాను, మిచెల్లీ ఇండియాలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని ఒబామా ఈ వారం ప్రారంభంలో ఓ ప్రకటనలో అన్నారు. భారత అనుభవాన్ని బట్టి దీపావళి మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసే పండుగ, మంచి ఆహారం, నృత్యాలతో ఈ పండుగను జరుపుకుంటారని ఆయన అన్నారు