ఒకరు క్రికెట్లో సూపర్ స్టార్. మరొకరు రేసులో నెంబర్ వన్. ఎవరా వీరిద్దరూ అని అనుకుంటున్నారా.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. జెర్మన్ ఫార్ములా వన్ లెజెండ్ మైకేల్ షుమాకర్. వీరిద్దరూ ప్రపంచంలో ఉన్న స్పోర్ట్స్ రంగాలను ఏలుతున్నారు. వీరిద్దరూ ఒకే చొట కలిస్తే అభిమానుల సందడి ఏవిధంగా ఉంటుందో అర్దం చేసుకొండి. ప్రస్తుతం ఇండియాలో గ్రేటర్ నోయిడాలోని అంతర్జాతీయ బుద్దా సర్యూట్‌లో శుక్రవారం ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుండి మహామాహా ఉద్దండులు రాబోతున్నారు.
2002లో టెస్టుల్లో 29 సెంచరీలు చేసి బ్రాడ్‌మన్ రికార్డు సమం చేసినప్పుడు సచిన్‌కు షుమాకర్ ఫెరారీ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను చివరిసారిగా ఎప్పుడు కలిశానో గుర్తు లేనప్పటికీ ఆదివారం జరిగే ఇండియన్ గ్రాండ్ ప్రి సందర్భంగా మరోసారి అతన్ని కలుస్తానని ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ తెలిపాడు. మాస్టర్‌ను కలవాలని తాను చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. ‘చివరిగా ఎప్పుడు కలిశానో నాకు గుర్తు లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు కలవాలా అని ఆరాటపడుతున్నా’ అని షుమాకర్ పేర్కొన్నాడు.
ఎఫ్1లో ఇప్పటికే ఏడు టైటిల్స్ గెలిచినా పునరాగమనంలో మాత్రం షుమాకర్ సత్తా చాటలేకపోతున్నాడు. అయితే విజయం సాధించడమే తనకు ఎక్కువ ఇష్టమని, ఓటమిని అంతగా జీర్ణించుకోలేనని ఈ జర్మన్ డ్రైవర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల వల్ల తన హయాంలో సాధించిన విజయాలకు వచ్చిన నష్టమేమీ లేదన్నాడు. సమయం వచ్చినప్పుడు గెలుపు దానంతట అదే వస్తుందన్నాడు. యూరప్ నుండి ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ చూడడం కొసం ప్రత్యేకంగా వస్తున్నానని తెలిపాడు. నేను కూడా రేసు ట్రాక్ మీద స్కూటర్ రైడ్ చేసి అభిమానులకు సందడి చేస్తానని తెలిపారు