లక్నో: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. రాజకీయపరమైన కారణాలతోనే తమ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలుకావడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ లేఖ రాశారని ఆమె ఆరోపించారు. ముందస్తు పథకం ప్రకారమే ఆయనీ పని చేశారని నిందించారు.అవకతవకల నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యల గురించి పట్టించుకోకుండా హడావుడిగా ఎందుకు లేఖ రాయాల్సివచ్చిందని ఆమె ప్రశ్నించారు.