సిఎం కిరణ్ వర్సెస్ మంత్రి డిఎల్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: ఎంసెట్ నుండి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ తీసేసి జాతీయ స్థాయి ఎన్ఈఈటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారనే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మెడికల్ ఎంట్రెన్స్‌ను ఇదే సంవత్సరం నుండి జాతీయ స్థాయి పరీక్షలకు అనుబంధంగా ఉంచాలన్న నిర్ణయంతో విద్యార్థులలో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఈ సంవత్సరం నుండి కాకుండా 2013 నుండి పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఇప్పటికిప్పుడు జాతీయస్థాయి పరీక్ష అంటే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అంతేకాకుండా కేవలం ఇంగ్లీషు, హిందీ మాధ్యమాలలో పరీక్షలు నిర్వహిస్తే తెలుగు మీడియం విద్యార్థులకు నష్టాన్ని కలుగజేస్తుందని ఆయన లేఖ రాయనున్నారు.అయితే ముఖ్యమంత్రి లేఖ రాస్తారనే వార్తల పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అన్నీ పరిశీలించాకే మెడిసిన్‌ను జాతీయస్థాయిలో టెస్టులో చేర్చామని చెప్పారు. ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా తీసుకున్నది కాదని తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన కొణిజేటి రోశయ్య హయాంలోనే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.