ఒప్పందానికి కట్టుబడి ఉంటాం: దానం :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విషయంలో గతంలో ఎంఐఎం పార్టీతో చేసుకున్న ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని నగర కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్  స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ నుండి కూడా దీనికి సంబంధించిన లేఖ తమకు అందిందని చెప్పారు. పార్టీలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడేళ్లు కాంగ్రెసు, రెండేళ్లు మజ్లిస్ అన్న తమ ఒప్పందంలో ఎలాంటి తేడా లేదన్నారు. అయితే కాంగ్రెసుకు రావాల్సిన మరో ఏడాది ఇప్పుడా లేక చివరి సంవత్సరమా అని చర్చించి నిర్ణయిస్తామన్నారు.రెండేళ్లపాటు కాంగ్రెసుకు దక్కే డిప్యూటీ మేయర్ పదవికి ఏడాదికి ఒకరు చొప్పున ఇద్దరికి కేటాయిస్తామని తద్వారా ఎక్కువ మందికి అవకాశం లభిస్తుందని దానం అభిప్రాయపడ్డారు. కాగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 104 కాల్ సెంటర్ ఉద్యోగులు చేపట్టిన చలో సచివాలయం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందిరాపార్కు నుండి ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులను లిబర్టీ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ తరలించారు.