'తెలంగాణ ఎమ్మెల్యేల తాజా నినాదం' :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు శానససభ్యులు జై కిరణ్ కుమార్ రెడ్డి నినాదాన్ని అందుకున్నారు. శుక్రవారం హైదరాబాదులోని సెంట్రల్ కోర్టులో సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టకూడదని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కూడా అనుకున్నారు. కేంద్రంపై ఏ రూపంలో ఒత్తిడి తేవాలనే విషయంపై నిర్దిష్టమైన కార్యక్రమం ఏదీ తీసుకోనట్లు తెలుస్తోంది.కాగా తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, తెలంగాణలోని రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై నవంబర్ 1వ తేదీన తిరిగి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.