ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ మధ్యన అనవసరమైన కారణాలతో మీడియాలోకి ఎక్కుతోంది.తాజాగా ఆమె ముంబైలోని ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చి మీడియా దృష్టిలో పడింది. ఆమె స్నేహితులు అంతా ఆమెను కవర్ చేద్దామని చూసినా ఫలితం లేకుండాపోయింది.ఆమె పూర్తి నిషాలో అక్కడికి వచ్చిందని అక్కడ బాలీవుడ్ పత్రికలు,మీడియా వ్యాఖ్యానించింది.ఆమె నుంచి పూర్తిగా లిక్కర్ వాసన వచ్చిందని,మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా ఒక్క పదం కూడా మాట్లాడి సమాధానం చెప్పలేక పోయిందని అన్నారు.చివరకు మీడియా వారు పట్టుపడితే…నేను ప్రస్తుతం నేపాల్ లోనే ఉంటున్నాను.అక్కడ మంచి జీవితమే గడుపుతున్నాను. నాది హ్యాపీ మ్యారీడ్ లైఫే.నాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ వెళ్లిపోయింది.