కత్తి శీను… కేరాఫ్‌ తిరుపతి :సినీ జ్వాల తెలుగు:

Posted on

‘డిస్కొ’ సినిమా కోసం నిఖిల్‌ మలేషియా ప్రయాణం కట్టాడు. పూరి జగన్నాథ్‌ వద్ద శిష్యరికం చేసిన హరికృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది ఆయనకు తొలి చిత్రం. నిఖిల్‌ తాజా ప్రాజెక్ట్‌ ‘వీడ తేడా’ కూడా షూటింగ్‌ పూర్తిచేసుకుని నవంబర్‌ 17న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్ర దర్శకుడు చిన్నకృష్ణ మాట్లాడుతూ…’వైఫల్యాలు లేనివారు ఇండిస్టీలో లేరు. అందుకు నిఖిల్‌ అతీతుడేమీ కాదు. అతనికి కూడా ఓ రోజు మంచి హిట్‌ దొరుకుతుంది. రాబోయే చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందుతుంది. సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు ఫీల్‌గుడ్‌ అనిపిస్తుంది’ అని అన్నారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ…’ఇండిస్టీలో అందరం చిన్నికృష్ణను జూనియర్‌ వి.వి.వినాయక్‌ అంటుంటాం. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉంటుందో, యాక్షన్‌ సీన్స్‌ కూడా అలానే అలరిస్తాయి. పెద్ద పెద్ద కమెడియన్లు పనిచేస్తున్నారు. అందర్నీ చాలా బాగా హ్యాండిల్‌ చేశారు. కత్తి శీను అనేది నా పాత్ర పేరు. కనబడ్డ అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తుంటాను. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ప్రతికారం వదిలిపెట్టి, ప్రేమను పంచాలి అన్నది మా కథలోని కీలకమైన పాయింట్‌’ అని తెలిపారు.