మగబిడ్దకు జన్మనిచ్చిన కాజోల్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

బాలీవుడ్ క్యూట్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్ జంటకు (సెప్టెంబరు-13) ఉదయం ముంబాయిలోని లీలావతి ఆసుపత్రిలో పండంటి మగబిడ్ద జన్మించింది. వీరికి ఇప్పటికే నైసా అనే ఏడేళ్ల పాప కూడా ఉంది . అజయ్-కాజోల్ 1999 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఇరువైపు సన్నిహితుల నుండి వరుసగా అభినందనల వర్షం కొనసాగుతూనే ఉందంట. కాజోల్ కి చాలా సన్నిహితుడైన షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ” భూమిమీదకు ఒక ప్రాణిని తీసుకురావడం అన్నది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వారం. అజయ్-కాజోల్ జంటని ఆ అల్లా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి. అజయ్ దేవగన్ కి కొడుకు పుట్టాడు…మాషా అల్లా” అని ట్వీట్ చేశాడు.

“ఒక కొత్త ప్రాణి ఈ భూమి మీదకు వచ్చినప్పుడల్లా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బాయి పుట్టిన శుభశందర్భంలో అజయ్-కాజోల్ కి ఇవే నా శుభాకాంక్షలు” అంటూ ప్రియాంకా చోప్రా “ట్విట్టర్” లో పేర్కొంది.