‘‘జీవితాన్ని తేలికగా తీసుకోవడం నాకిష్టం ఉండదు. జరిగేది జరగక మానదులే అని వేదాంత ధోరణిలో ఆలోచించడం చేత కాదు. ఎలా పడితే అలా బతికేయాలని అనుకోను. ఒక పద్ధతి ప్రకారం జీవిస్తే.. ఆ జీవితానికో అర్థం ఉంటుందని నా ఫీలింగ్. అందుకే నాకంటూ కొన్ని నియమ, నిబంధనలు పెట్టుకుని.. వాటికి అనుగుణంగా లైఫ్ లీడ్ చేస్తుంటాను’’ అన్నారు శ్రీయ. సినిమాల్లో గ్లామరస్*గా కనిపించే శ్రీయ రియల్ లైఫ్*లో మాత్రం చాలా సింపుల్*గా ఉండటానికి ఇష్టపడతారు.
ఆ విషయం గురించి ఆమె చెబుతూ – ‘‘నా వృత్తి యాక్టింగ్ కాబట్టి అందుకు అనుగుణంగా స్క్రీన్ మీద కనిపిస్తాను. ప్రేక్షకుల ఇష్టప్రకారం ఆ విధంగా కనిపించడం మా ఆర్టిస్టుల డ్యూటీ. కానీ పర్సనల్*గా నా ఇష్టప్రకారం నేను ఉంటాను. నా వయసులో ఉన్న మధ్యతరగతి అమ్మాయిలు ఎంత సింపుల్*గా ఉంటారో నేనూ అలానే ఉంటాను. నా కుటుంబం అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే హ్యుమన్ రిలేషన్స్*కి ఇంపార్టెన్స్ ఇస్తాను’’ అన్నారు. ఒక్కసారి గడియారం వెనక్కి వెళితే మీరేం చేస్తారు? అని శ్రీయను అడిగితే – ‘‘బాల్యంలోకి వెళ్లిపోతా. ముఖ్యంగా పదేళ్ల వయసులో నా లైఫ్ చాలా బాగుండేది.
ఆ ఏజ్*లోకి వెళ్లిపోతా. దాన్ని పూర్తిగా ఆస్వాదించి.. ఆ తర్వాత నా సినిమా జీవితంలోకి వస్తా. తొందరపాటువల్లో, తెలియనితనంవల్లో నేను కొన్ని పిచ్చి సినిమాలు చేశాను. ఆ సినిమాల ఫెయిల్యూర్స్*కి నేను చాలా బాధపడ్డాను. గడియారం వెనక్కి వెళితే మాత్రం నేను చేసిన ఆ సినిమాలను చెరిపేసి.. నా సినిమా లిస్ట్*లో లేకుండా చేస్తా’’ అన్నారు. అయితే మీరలాంటి సినిమాలు చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నారా? అనే ప్రశ్నను శ్రీయ ముందుంచితే – ‘‘ఎవరైనాసరే తప్పు చేస్తే పశ్చాత్తాపపడతారు. రాంగ్ మూవీస్ చేయడం తప్పు కాదు. సినిమా జయాపజయాలు ప్రేక్షకుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి పశ్చాత్తాపపడటంలేదు. జస్ట్ బాధ మాత్రమే ఉంది’’ అన్నారు.