తొలిచిత్రమే సల్మాన్*ఖాన్*తో హీరోయిన్*గా చేసిన హీరోయిన్* ఆమె. ‘లక్కీ’ చిత్రం ద్వారా బాలీవుడ్*లో పరిచయమై అందరిచేత జూనియర్* ఐశ్వర్యరాయ్* అనిపించుకుంది. కానీ లక్కీ ఆమె విషయంలో రివర్స్*గేర్*లో నడుస్తోంది. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్*, నేనుమీకు తెలుసా, వంటి చిత్రాలలో చేసినా నటిగా రావలసినంత గుర్తింపు మాత్రం ఉల్లాల్*కి రాలేదు. ‘సింహా’ వంటి బ్లాక్*బస్టర్* మూవీలో నటించినా బాలకృష్ణ క్రెడిట్*లోకి వెళ్లిపోయింది అదంతా. ఇప్పుడు మాత్రం స్నేహాఉల్లాల్*ని అంతా జూనియర్* ఐశ్వర్యరాయ్* అని మాత్రం పిలవడంలేదు. ఎందుకో ఆమెలో మునిపటి ఉత్సాహంగానీ ఉల్లాసంగానీ అన్నింటికన్నా ముఖ్యంగా ముఖంలో చార్మింగ్*గానీ లేదంటున్నారు తెలుగు సినిమా అభిమానులు. టాలీవుడ్*లో మాత్రం సమంత, కాజల్*, తమన్నా, ఇలియానాలాంటి హీరోయిన్లను కాదని స్నేహాఉల్లాల్*కి మాత్రం అవకాశాలు దక్కడమనేది కల్లే అంటున్నారంతా. ఆశలన్నీ మడతకాజాపైనే అంటున్న ఉల్లాల్*కి ఆ చిత్రంతో అదృష్టం కూడా మడతపడిపోతుందని భావిస్తున్నారు. కాగా ఉల్లాల్*కి సలహాలిచ్చేవారు లేక అటు పెద్దహీరోలతో అవకాశాలు రాక అటు ఇటు కాక ఊగిసలాడుతోంది ఉల్లాల్*.