విజయ్ మంచి ఫ్రెండ్ మాత్రమే..అమలాపాల్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఒక హీరోయిన్*పై గాసిప్పులు మొదలయ్యాయంటే… ఆమెకు స్టార్*డమ్ వచ్చినట్టే లెక్క. ప్రస్తుతం కేరళకుట్టి అమలాపాల్*పై కూడా కోలీవుడ్*లో గాసిప్పులు మొదలయ్యాయి. అంటే ఆమె కూడా స్టార్*హీరోయిన్ అయిపోయారన్నమాట. ఇంతకీ అమలాపాల్*పై వచ్చిన గాసిప్ ఏమిటి అనే వివరాల్లోకెళితే… ‘దైవతిరుమగళ్’ (తెలుగులో ‘నాన్న’) దర్శకుడు విజయ్*తో ఆమె సన్నిహితంగా మెలుగుతున్నారని ఓ గాసిప్ కోలీవుడ్ మీడియాలో షికార్లు చేస్తోంది.

చెన్నయ్*లో ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ఇటీవలే జరిగిన విజయ్ తల్లిదండ్రుల సష్టిపూర్తి మహోత్సవానికి కూడా అమలపాల్ హాజరయ్యారని, విజయ్ ఇంట్లో వాళ్లకు కూడా అమలాపాల్ బాగా నచ్చేశారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కోలీవుడ్*లో గుసగుసలు మొదలయ్యాయి. కానీ వాటన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు అమలాపాల్. ‘‘నాపై గాసిప్స్ మొదలయ్యాయంటే… నేను ఎదిగినట్టే లెక్క. నిజానికి విజయ్ నాకు మంచి ఫ్రెండ్.

మా ఇద్దరి మధ్య రిలేషన్ అంతవరకే. నటిగా ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం వంద సినిమాల్లో అయినా కథానాయికగా నటించాలనేది నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్. ప్రస్తుతం ఈ అందాలభామ తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో నాగచైతన్య సరసన ‘బెజవాడ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నా