ఎన్నో సవాళ్ళతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం సవాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకి సాగుతుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. ఆదివారం నాడు స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగా ణ ఎం.పి.లు పదిమంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడంతో తెలంగాణ సమస్య తీవ్రత తెలుస్తుందని, తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ప్రధాని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా 2జి కుంభకోణంతో ఉక్కిరి బిక్కిరి అవుతుండడం, సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రులనే అరెస్టు చేసి జైలులో పెట్టడం వంటివి ప్రధానమంత్రికి చికాకు కలిగిస్తున్నాయి.
ఇక దేశంలోనే అధిక ఎం.పి.లని అందించిన ఆంధ్రప్రదేశ్‌లో సమైఖ్య, ప్రత్యేక వాదం సమస్యని వీలయినంత త్వరగా తేల్చేయడానికే ప్రధాని, సోనియా భావిస్తున్నట్టు ప్రధాని మాటలని బట్టి తెలుస్తోంది. అయితే ఈ సమస్య అంత తేలికగా కొలిక్కి వచ్చేట్టు కనిపించడం లేదు. ఓ వైపు ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ తెలంగాణ బంద్‌లకి పిలుపునిస్తూ ఉద్యమం తీవ్రతరం చేస్తూండడం, మరో వైపు సమైఖ్యవాదులు కూడా అదే స్థాయిలో ఉద్యమాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తుండడం వెరసి ఈ సమస్య కేంద్రానికి పెద్ద తలనొప్పి వ్యవహారమే అని వేరే చెప్పాల్సిన పని లేదు.. మొత్తానికి ఈ సమస్యని ప్రధాని, సోనియా ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.