వివాదాలకు దూరంగా ఉండే హైదరాబాద్ స్టయిలిస్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌పై ఓవివాదంలో ఇరుక్కున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో వివిఎస్. లక్షణ్ తన బ్యాట్ చివరలకి వాజిలిన్ రుద్దినట్టు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆరోపించాడు. డిసిషన్ రివ్యూ సిస్టమ్‌లో హాట్ స్పాట్ టెక్నాలజీని మాయ చేయడానికి లక్ష్మణ్ తన బ్యాట్‌పై వాజిలిన్ వాడినట్లు, వాజిలిన్ రుద్దడం వల్లనే బ్యాట్ అవుట్ సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లిన బంతికి అవుటైనప్పటికీ లక్ష్మణ్ దొరకలేదని మైఖెల్ వాన్ తన ట్విట్టర్‌లో రాశాడు. ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. లక్ష్మణ్ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమ్స్ అండర్సన్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతి బ్యాట్‌నుంచి వెళ్లిపోయింది. దాంతో ఇంగ్లాండు క్రీడాకారులు అవుట్‌కు అపీల్ చేశారు. అంపైర్ అసద్ రవూఫ్ నాటవుట్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండు స్కిప్పర్ డిఆర్ఎస్‌కు వెళ్లాడు. దాంట్లో కూడా లక్ష్మణ్‌కు అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. కెవిన్ పీటర్సన్, లక్ష్మణ్ స్వల్ప వాగ్వివాదానికి కూడా దిగారు. అయితే, బంతి బ్యాట్‌ను రాసుకుంటూ వెళ్లిందని స్టార్ట్ బ్రాడ్ మీడియా ప్రతినిధులతో అన్నాడు.
కొన్ని సార్లు అతి సున్నితంగా బంతి తాకినా హాట్ స్పాట్ పట్టుకోలేదని బ్రాడ్ అన్నాడు. అయితే, మైఖెల్ వాన్ ఆరోపణతో వివాదం ప్రారంభమైంది. బ్రాడ్ లక్ష్మణ్ బ్యాట్‌ను పరిశీలించాడు కూడా. దానికి వాజిలిన్ గానీ, ఇతర ద్రవపదార్థం గానీ లేదని బ్రాడ్ స్పష్టం చేశాడు. కొన్నిసార్లు ఫెయింట్ ఎడ్జ్‌ను హాట్ స్పాట్ పట్టుకోలేదని అనతు అన్నాడు. మైఖేల్ వాన్ చేసిన ఈ విమర్శని కొందరు తప్పుపడుతున్నారు. టెస్ట్ మ్యాచుల్లో వివిఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్‌లో రానిస్తూ భారత్ గెలుపుకు తన వంతు కృషి చేస్తుండడంతో ఓర్వలేకే ఈ వివాదం సృష్టించారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమయినప్పటికీ వివాదాలకి దూరంగా ఉండే వి.వి.ఎస్. లక్ష్మణ్ ఈ వివాదంలో ఇరుక్కోవడం భారత క్రికెట్ అభిమానులకు రుచించడంలేదు.