లక్షలకోట్ల రూపాయల సంపద బయటపడిన కేరళ, తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ సమీపంలో ఉన్న దుకాణాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు, భారీ పేలుళ్ళ శబ్దాలతో ఆలయ ప్రదేశం దద్దరిల్లింది. ఈ ఆలయం నుండి లక్షల కోట్ల నిధి బయటపడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసింది. ఆలయంలోని 5 నేలమాళిగలలోనుండి ఈ నిధి బయటికి తీసారు. అయితే ఆరవ నేలమాళిగను తెరవడానికి ప్రయత్నించినా ఆ నేలమాళిగకు నాగబంధనం ఉందన్న తెలుసుకుని దానిని తెరిచే ప్రయత్నం విరమించుకున్నారు. మరో ప్రక్క ఆ 6వ నేలమాళిగను పరిశీలించడానికి సోమవారం నాడు నిపుణుల బృందం ఆలయానికి రాబోతున్నారు. ఈ సందర్భంలో ఈ ఘటన జరగడం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన వెనుక కారణం ఏమై ఉంటుందన్నదాని గురించి చర్చలు మొదలయ్యాయి.
6వ నేలమాళిగని తెరిస్తే అరిష్టం అని, దాన్ని తెరిచే ఆలోచన విరమించుకోవాలని కొందరు చెప్పినప్పటికీ దాన్ని తెరవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగానే ఈ సంఘటన జరిగిందా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి డిజిపి, ఎస్.పి. జిల్లా కలెక్టరు హుటాహుటిన బయల్దేరారు. అయితే పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న లక్షలకోట్ల నిధికి ఎలాంటి ఆపదా లేదని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. ఈ పేలుళ్ళ వెనుక ఆ నిధిని కొల్లగొట్టడానికి ఎవరైనా చేసిన ప్రయత్నం ఉందేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.