కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ తో తెలంగాణపై చర్చలు సరైన దిశలో సాగడం లేదని తెలంగాణ జెఎసి ఛైర్మన్ ఎమ్.కోదండరామ్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ఏర్పాటు దిశగా ఈ సాగడం లేదని అర్ధం అవుతున్నదని ఆయన అన్నారు. లక్ష్యం లేకుండా చర్చలు జరుగుతున్నందున తాము ఆగస్టు ఒకటి నుంచి సమ్మెలోకి వెళుతున్నామని కోదండరామ్ తెలిపారు.కాగా ఉద్యోగుల సమ్మెలోకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ,
తమకు అండగా ఉంటామని బిజెపి నేత సుష్మ స్వరాజ్ చెప్పారని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మెకు ఆమె సంఘీభావం వ్యక్తం చేస్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకుంటే పార్లమెంటులోకాని, లేదా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని వస్తారన్నమాట. తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కలసి కోదండరామ్ డిల్లీలో ఆయా ప్రముఖులను కలిసి తెలంగాణపై సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.