సంగీత దర్శకుడు అనిల్ రెడ్డిది సహజమరణమే అని ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. మెదడులో నరాల చిట్లడం వల్లే అనిల్ రెడ్డి మరణించినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు. అనిల్‌రెడ్డ్డిది సహజమరణం కాదంటూ ఆయన కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రీపోస్టుమార్టం నిర్వహించారు.
గతంలో రెండు సార్లు పోస్టుమార్టం నిర్వహిం చడం, ఒక నివేదికలో అనిల్ తలకి బలమైన దెబ్బ తగలడంతో మరణించాడని తేలడం, దాంతో అనిల్ కుటుంబ సభ్యులు మళ్లీ పోస్ట్ మార్టమ్ కోసం డిమాండ్ చేయడంతో మరోమారు అనిల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రకరకాల ఊహాగానాలకి తెరతీస్తూ అనిల్ మృతి సహజమైనదే అని డాక్టర్లు నిర్ధారించడం విశేషం.