టెలికం రంగాన్ని దెబ్బ తీసిన 2జి స్కామ్ కన్నా 16,085 కోట్ల మైనింగ్ స్కామ్ అతి పెద్దదని కర్నాటక కాంగ్రెసు అధికార ప్రతినిధి బికె హరిప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై లోకాయుక్త అభియోగం మోపినా కూడా ఇంకా ఆయన సిఎం. కుర్చీని విడవకుండా కూర్చోవడం భావ్యం కాదని, నైతిక బాధ్యత వహించి వెంటనే సి.ఎం. పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యతిరేకుల నుండి బలంగా వినిపిస్తోంది.. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా కర్ణాటక మైనింగ్ స్కామ్ పెద్దదని కాంగ్రెసు పార్టీ అంటోంది.
లోకాయుక్త సంతోష్ హెగ్డే ముఖ్యమంత్రి యడ్యూరప్పను, ఆయన కుటుంబ సభ్యులను తప్పు పట్టిన నేపథ్యంలో కర్ణాటక మైనింగ్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. యడ్యూరప్పను రాజీనామా చేయాలని బిజెపి చేసిన డిమాండ్ ఆలస్యమైందని, ఆ చర్య సరిపోదని ఆయన అన్నారు. ఏది ఏమయినప్పటికీ తాను ముఖ్యమంత్రి పీఠం నుండి దిగబోనని భీష్మించుకు కూర్చున్న యడ్యూరప్ప భవితవ్యం ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.