దూకుడు రెండు వందల రోజుల సినిమా :సినీ జ్వాల తెలుగు:

Posted on

దూకుడు' ఎంత లేదన్నా రెండు వందల రోజులు అడుతుంది.అంతకన్నా ఎక్కువ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు బ్రహ్మానందం. నిన్న రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన 'దూకుడు' ఆడియో పంక్షన్ కి హాజరైన బ్రహ్మానందం ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రంలో మహేష్ కంప్లీట్ గా ఢిఫెరెంట్ గా కనిపిస్తాడని చెప్పారు. అంతేగాక మహేష్ తన కాంబినేషన్ లో మంచి కామిడీ వర్కవుట్ అయ్యిందని నమ్మకం వ్యక్తం చేసారు. అంతేగాక శ్రీను వైట్ల తనకు ఎప్పుడూ తన సినిమాల్లో మంచి పాత్రలు ఇస్తాడని, ఈ చిత్రంలో కూడా సూపర్బ్ గా ఉండే ఓ పాత్రను డిజైన్ చేసాడని చెప్పుకొచ్చారు. ఇక 'దూకుడు'చిత్రం వచ్చే నెలలో విడుదల కావటానకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కామిడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్బుతంగా వచ్చాయని చెప్తున్నారు.