పోకిరి డైలాగ్స్ కంఠాపథంగా చెబుతాడు :సినీ జ్వాల తెలుగు:

Posted on

గౌతమ్ ను బాలనటుడిగా పరిచయం చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. నేను బాలనటుడిగా నటించిన విషయానికొస్తే..నటిన పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన నాన్నగారు నా చదువు పాడవకుండా వేసవి సెలవుల్లో మాత్రమే నేనే నటించేలా ప్లాన్ చేసేవాడు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ‘పోరటం, శంఖారావం, గూఢచారి నెం.1, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం’ వంటి చిత్రాలన్నీ నేను సమ్మర్ లో చేసిన చిత్రాలే. ఇక హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాలని నిర్ణయించుకున్నాకే నేను బాలనటుడిగా నటించడం మానుకున్నాను.

మరి, గౌతమ్ ను కూడా ఇలాగే సమ్మర్ లో నటించపజేసే ఆలోచన ఏమైనా వుంది?ఎందుకంటే మీ ఫ్యాన్స్ అంతా గౌతమ్ ను బిగ్ స్ర్కీన్ పై చూడాలని ఉందని ఉవ్విళ్లూరుతున్నారు కదా అంటే? అవును ఈ విషయమై అభిమానుల నుంచి చాలా ఒత్తిడి వుంది. ప్రతి ఒక్కరు ఈ విషయమే అడుగుతున్నారు. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆ విషయం గురించి ప్రస్తుతానికైతే ఆలోచించలేదు. భవిష్యత్తు గురించి చెప్పలేం కదా..అన్నారు మహేష్..

నా సినిమాల్లోని డైలాగులు, పాటలు గౌతమ్ కు కంఠాపథంగా వచ్చు. ముఖ్యంగా ‘పోకిరి’ చిత్రంలోని డైలాగులు అస్తమానం చెబుతుంటాడు. ఏక్ నిరంజన్’ లోని ‘అమ్మాలేదు..నాన్నాలేడు’ పాట కూడా పాడుతుంటాడు. నేను ఇంట్లో వున్నంతసేపు వాడితో ఆడుకుంటూ, వాడు చేసే అల్లరిని ఆస్వాదిస్తూ వుంటాను. తను ప్రస్తుతం బుద్దిగా స్కూల్ కు వెళుతూ ఇంట్లో అల్లరి పనులు చేస్తూ వున్నాడు. నేను కూడా చిన్నప్పుడు నాన్నగారి సినిమాల్లో డైలాగులు వల్లెవేస్తూ, నాన్నగారిని అనుకరిస్తూ వుండేవాడిని. అదే క్రమంగా ఆసక్తిగా మారిపోయింది. గౌతమ్ కు కూడా ఆ అనుకరణ ఆసక్తిగా మారుతుందేమో చూద్దాం అని సినిమాల పట్ల గౌతమ్ చూపే ఆసక్తి గురించి తెలుపుతున్నాడు మహేష్ బాబు...