జడ్జిగా ఉండడానికి ఓకే అన్న సెక్సీ హీరోయిన్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

అమెరికాలో ఎంతో మంది అభిమానుల అభిమానం చూరగొన్న రియాలిటీ టివి షో అమెరికన్ ఐడల్. అటువంటి కార్యక్రమాన్ని పది సిరిస్‌లు విజయవంతంగా పూర్తిచేశారు. త్వరలో పదకొండవ సిరిస్‌కి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో ఈ రియాలిటీ టివి షోకి జడ్జిగా వ్యవహారించిన హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల పదకొండవ సిరిస్ ఎపిసోడ్‌కి జడ్జిగా వ్యవహారించడం లేదని రూమర్స్ గుప్పుమన్నాయి. ఐతే ఈరోజు ఇలాంటి రూమర్స్ అన్నింటికి పటాపంచలు చేస్తూ జెన్నిఫర్ లోపెజ్ అమెరికన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గోనున్నారని వార్త వెలువడింది.

ఏడు సంవత్సరాలుగా కలసి ఉన్న తన మాజీ భర్త మార్క్ ఏంటనీ నుండి ఇటీవలే విడాకులు తీసుకున్న జెన్నిఫర్ లోపెజ్ రాబోయే కాలంలో కాలంలో తన ప్రణాళికలను సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగానే అమెరికన్ ఐడల్‌‍లో జడ్జిగా వ్యవహారించడానికి సిద్దమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికన్ ఐడల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. గతంలో మాదిరే ఈ సంవత్సరం కూడా అమెరికన్ ఐడల్ కార్యక్రమానికి ముగ్గురు జడ్జిలు వస్తారని అన్నారు. ఆ ముగ్గురు జెన్నిఫర్ లోపెజ్, టేలర్, జాక్సన్ గా వెల్లడించారు.

ఈ ముగ్గరు కలసి అమెరికన్ కొత్త టాలెంట్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. త్వరలోనే ఈ ముగ్గరు కలసి హూస్టన్, సెయింట్ లూయిస్, పోర్ట్ ల్యాండ్, శాన్ డియిగో, పిట్స్ బర్గ్, చార్లెస్టన్ సిటీలలో హాంటింగ్ మొదలుపెట్టనున్నారన్న విషయాన్ని తెలియజేశారు.