న్యూఢిల్లీ : తీహార్ జైలు వద్ద అన్నా మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో భాగంగా సామాజిక కార్యకర్త అన్నాహజారే నిర్బంధించబడిన తీహార్జైల్ వద్దకు స్వామి అగ్నివేశ్, మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీ, సామాజికవేత్త మేథా పాట్కర్ తదితరులు చేరుకున్నారు. అన్నా అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు. తీహార్ జైలు వద్దకు చేరుకుంటున్న ప్రజలు నియంత్రించడంలో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవినీతి నిర్మూలన చేయాల్సిందేనని స్వామి అగ్ని వేశ్ పేర్కొన్నారు. పెరిగిపోతున్న అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పీకివేయడానికి ప్రజా ఉద్యమం అవసరమని ఆయన చెప్పారు.