కాజల్ ఇంటర్వ్యూలు దడ కి హెల్ప్ అవుతాయా...! :సినీ జ్వాల తెలుగు:

Posted on

తెలుగు తెరపై దూసుకెళ్తున్న నటి కాజల్‌. గ్లామర్‌ పాత్రలే కాకుండా అభినయానికీ ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంచుకుంటోంది. నాగచైతన్య సరసన నటించిన 'దడ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'దడ' సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ, విడుదలకు ముందు కానీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించని కథానాయిక కాజల్ ఒక్కసారిగా నిన్నల్లా హైదరాబాదులో మీడియాకు తెగ ఇంటర్వ్యులు ఇచ్చేసింది. ఆ సినిమా గురించి, హీరో నాగ చైతన్య గురించీ తెగ పొగిడేస్తూ మోసేసింది. నాగ చైతన్య చాలా ఆనేస్టీ వున్న కుర్రాడనీ, ఫ్రెండ్లీ నేచర్ గలవాడనీ చెప్పింది. సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే...మాస్‌ అండ్‌ స్టయిలిష్‌. బృందావనం మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ దడ చిత్రాల్లో ఫర్ఫా మెన్స్ కి స్కోపున్న పాత్రలు దక్కాయి. ఇందులో నేనే డబ్బింగ్‌ చెబుదామనుకున్నా. కానీ వేరే షూటింగ్‌ బిజీ ఉండటం వల్ల గాయని చిన్నయి డబ్బింగ్‌ చెప్పింది.

అయితే, సినిమా గురించి ఆమె ఏం చెప్పినా... ఎంత చెప్పినా.. ఏదో మొహమాటానికి చెప్పినట్టుగానే కనపడింది. అసలు మొదట్లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి కాజల్ ఇష్టపడలేదనీ, నాగార్జున సైడ్ నుంచి ఎంతో ప్రెజర్ చేయడం వల్ల, ఇలా ఓ రోజు ఇంటర్వ్యులకు కేటాయించిందనీ చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఈ సినిమాకు నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిన నేపథ్యంలో... కాజల్ ఇంటర్వ్యులు సినిమా ప్రమోషన్ కు ఏమాత్రం ఉపయోగపడతాయో చూడాలి మరి!