అమల నోట్లో దుమ్ముకొట్టిన శృతి హాసన్‌ :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఇప్పుడిప్పుడే ఎదుగుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అమలా పౌల్ నోట్లో దుమ్ము కొట్టిన పరిస్ధితి తీసుకు వచ్చింది శృతి హాసన్. శృతి హాసన్‌ మనసు మార్చుకోవడంతో అమలాపాల్‌ చేతిలోని సినిమా చేజారింది. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య 'త్రీ' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత శ్రుతిని నాయికగా ఎంచుకొంటే కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయింది. అప్పుడు అమలాపాల్‌ని తీసుకొన్నారు. ఇప్పుడు శ్రుతి నటిస్తానని చెప్పడంతో అమలాని తప్పించారు. నాన్న చిత్రంతో పరిచయమైన అమలా పౌల్ ఈ ధనుష్ సరసన ఛాన్స్ అనగానే మురిసిపోయింది.

ఈ త్రీ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.ఈ చిత్రం హిట్టైతే తన కెరీర్ గాడిన పడుతుందని ఆశించింది. అయితే అనుకోని విధంగా శ్రుతి సీన్ లోకి రావటంతో ఆమె పాపం నీరసపడిపోయింది. ఇక నాగచైతన్య సరసన సైతం అమలా పౌల్ ని తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రంలో ఆమెను ఓ హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ఆమె పై బ్యాన్ పెట్టాలని మళయాళి పరిశ్రమ ప్లాన్ చేస్తోంది. మళయాళం నుంచి వెళ్ళి అక్కడ సినిమాలను చిన్న చూపు చూస్తోందని,మళయాళ పరిశ్రమ కత్తిగట్టింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పోవటం ఆమెను బాధపెట్టే అంశమే.