అల్లు అర్జున్ రేపు ఆస్ట్రేలియా వెళుతున్నాడు. ఏదో షూటింగ్ కోసం కాదు... హాలిడే ఎంజాయ్ చేయడానికీ అంతకన్నా కాదు. తననెప్పటి నుంచో బాధిస్తున్న భుజం నొప్పికి ఆపరేషన్ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి వెళుతున్నాడు. 'ఆర్య-2' సినిమా సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా అర్జున్ భుజానికి గాయమైంది. అయితే, అప్పటి నుంచీ ఇక్కడే దానికి చికిత్స తీసుకుంటూ వచ్చాడు.
'వరుడు' సినిమా చేశాక అది మరింత పెరిగింది. తాజాగా 'బద్రీనాథ్' సినిమాలో మరిన్ని యాక్షన్ సీన్స్ చేయడంతో, ఆ నొప్పి తట్టుకోలేని స్థాయికి చేరిందట. దాంతో, ఇక సర్జరీయే దీనికి పరిష్కారమని డాక్టర్లు తేల్చడంతో పెర్త్ లో అందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి అవసరం కాబట్టి, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందనున్న సినిమా కొన్నాళ్లు వాయిదా పడిందని అంటున్నారు. ఏమైనా, బన్నీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం.