పుల్బానీ(ఒడిశా): గ్రామీణాభివృద్ధితోనే నక్సలిజం సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరాం రమేష్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధితో గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లా కంధమాల్‌లో ఆయన పర్యటించారు. నక్సలిజంపై పోరుకు గ్రామీణాభివృద్ధే సమాధానమని చెప్పారు. సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.