హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు తెలంగాణలో మత కలహాలు సృష్టించేందుకు సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మతకలహాలు పెరుగుతాయని వారు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ తెలంగాణలో అన్యోన్యంగా జీవిస్తున్న హిందూ, ముస్లింల మధ్య విబేధాలు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
వందల ఏళ్లుగా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లింలు ఒకరి పండుగలలో ఒకరు పాలుపంచుకుంటూ మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారన్నారు. అలాంటి వారి మధ్య కొందరు సీమాంధ్ర నేతలు లేనిపోని ఆగాధం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.