అనుష్క స్థానంలో నికిషా! :సినీ జ్వాల తెలుగు:

Posted on

పవన్ కళ్యాన్ తో నటించిన ‘పులి’ సినిమా హిట్టయితే తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవచ్చని ఆశపడ్డ నిఖిషా పటేల్ ఆ సినిమా ప్లాపవడంతో...తెలుగులో ఏ ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది. అయితే కోలీవుడ్, సాండల్ వుడ్ లలో మాత్రం కొన్ని అవకాశాలు దక్కించుకుని ఓ మోస్తరు హీరోయిన్‌గా కొనసాగుతోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం...నికిషా టాలీవుడ్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య గోపీచంద్-అనుష్క జంటగా ‘లక్ష్యం’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా కన్నడలో ‘వరద నాయక’ అనే పేరుతో రూపొందుతోంది. లక్ష్యంలో అనుష్క పోషించిన పాత్రను ఇందులో నికిషా దక్కించుకుంది. ఇందులో సుదీప్, అర్జున్ లాంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. భూమిక కూడా ఇందులో ఓ పాత్ర పోషిస్తుందట. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే....తెలుగులోనూ అవకాశాలు దక్కించుకోవచ్చని ఆశ పడుతోందట నిఖిషా పాప.