అష్టచెమ్మ పాపకు అవే కష్టాలు :సినీ జ్వాల తెలుగు:

Posted on

ఒక్క సినిమా హిట్టయితే చాలు హీరోయిన్లకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడతాయి. అదే విధంగా ఒక్క సినిమా ప్లాపయితే చాలు ఫామ్‌లో ఉన్న వారు సైతం పాతాళానికి పడి పోతారు. సినిమా రంగుల ప్రపంచం తీరే అంత. ఇదే తరహాలో అష్టచెమ్మ సినిమా ద్వారా హిట్ కొట్టి కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్న కలర్స్ స్వాతి...అవి ప్లాపవడంతో మళ్లీ అవకాశాలు లేక ఈగలు తోలుకుంటోంది.

ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు లేక పోవడంతో ఖాళీగా ఉంటున్న స్వాతి....అక్క, చెల్లి, అతిథి పాత్రలనే తేడా లేకుండా అన్ని పాత్రలు ఒప్పకుంటూ కాలం గడిపేస్తోంది. ఆ మధ్య ‘మిరపకాయ్’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించిన స్వాతి, ‘కందిరీగ’లో కూడా ఇలా కనిపించి అలా మాయమైంది. తాజాగా రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న రచ్చ సినిమాలో కూడా స్వాతి గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పాపం..ఈ పాపకు పూర్వవైభం మళ్లీ వస్తుందో? ఇలానే చిన్న చితక పాత్రలు చేస్తుందో? దేనికైనా టైం రావాలి..