టిఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మీడియాతో అన్నారు. ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కె తారక రామారావు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్‌కు బెదిరింపు కాల్సు వస్తున్న దృష్ట్యా భద్రత పెంచాలని సిఎంను కోరినట్లు హరీష్ రావు చెప్పారు. టి-నేతలకు పలువురికి బెదిరింపు కాల్సు వస్తున్నాయని ఆయన అన్నారు.

మెట్రో రైలు పేరుతో చారిత్రక కట్టడాలను కూల్చి వేస్తే ఊరుకునేది లేదని ఈటెల అన్నారు. కట్టడాలు కూల్చకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. వందల ఎకరాల భూమిని సేకరించి వ్యాపార సముదాయాలకు ఇవ్వడం సరికాదని ఈటెల అన్నారు. మెట్రో వల్ల గన్‌పార్కుకు ప్రమాదం ఏర్పడటమే కాకుండా అసెంబ్లీ భద్రతకు ముప్పు ఉంటుందని నాయిని నరసింహారెడ్డి అన్నారు. అండర్ గ్రౌండ్ మెట్రోను వేయాలని డిమాండ్ చేశారు.