జగపతిబాబు, ఛార్మి జంటగా ఇటీవల 'నగరం నిద్రపోతున్న వేళ' పేరుతో ఓ సినిమా నిర్మించిన నిర్మాత నంది శ్రీహరిని హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గురుదేవ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయలకు ప్రజలను మోసం చేసిన కేసులో ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90 కోట్ల రూపాయలకు పలువురు ఖాతాదారులను శ్రీహరి మోసం చేసినట్టు పలు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి, కేసు పెట్టడం జరిగింది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఇలా పలు నేరాలలో ఇరుక్కోవడం పరిశ్రమ ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తోంది.