సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడికి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంతో పేరుంది. మొత్తం భారతీయ భాషలన్నిట్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత సాధించారాయన. తెలుగులో అయితే ప్రముఖ హీరోలందరితోనూ సినిమాలు నిర్మించిన క్రెడిట్ ఆయనకుంది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో కూడా చిత్ర నిర్మాణం చేస్తూ ఉషారుగా వున్నారాయన. తాజాగా ఆయన నిర్మించిన 'ముగ్గురు' సినిమా ఈ నెల 19 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంచితే, తన ఇద్దరు మనవళ్ళతో కూడా సినిమాలు నిర్మిస్తానని చెబుతున్నారు రామానాయుడు. కొడుకు కొడుకైన రానాతోనూ, కూతురు కొడుకైన నాగచైతన్యతోనూ సినిమాలు నిర్మించడానికి కథలు తయారుచేయిస్తున్నారిప్పుడు. నాగ చైతన్యతో జనవరిలోనూ, ఆ తర్వాత రానాతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.