దగ్గరవుతున్న యన్టీఆర్- చిరంజీవి కుటుంబాలు? :CineJwala Telugu:

Posted on

ఎక్కడా లేని విచిత్రాలన్నీ మన సినిమా ఇండస్ట్రీలోనే కనపడతాయి. కాకపొతే ఏమిటి చెప్పండి... యన్టీఆర్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ యుద్ధం చిరంజీవి, బాలకృష్ణ మధ్య జరిగితే... ఇప్పుడు జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ తేజాల మధ్య జరుగుతోంది. ఇదంతా ఆధిపత్యపోరుగానే చెప్పుకోవాలి. అంటే... నెంబర్ వన్ స్థానం కోసం పోటీ! అయితే, ఇప్పుడీ రెండు కుటుంబాల మధ్యా బంధుత్వం ఏర్పడుతోందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
               ఎలాగంటే... రామ్ చరణ్ పెళ్లి చేసుకోబోయే ఉపాసనా కామినేని అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డికి మనవరాలన్న సంగతి తెలిసిందే. అంటే ఉపాసన వాళ్లమ్మ శోభన, ప్రతాపరెడ్డికి కూతురు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని కమ్మ కులానికి చెందిన వ్యక్తి. అనిల్ తండ్రి సూర్యనారాయణరావు పెద్ద యన్టీఆర్ కు దగ్గరి బంధువట. ఈ ప్రకారం చూస్తే, సినిమా రంగంలో బద్ధ శత్రువులైన యన్టీఆర్, చిరంజీవి కుటుంబాలు వ్యక్తిగతంగా ఇలా దగ్గరవుతున్నాయన్న మాట!