అమితాబ్ బచ్చన్ నటించిన 'ఆరక్షణ్' సినిమా విడుదలకు ముందే వివాదాస్పదమై, దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది. రేపు విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసింది. బలహీన వర్గాల వారి మనోభావాలను కించపరిచే విధంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వుండడం వల్ల చిత్రాన్ని నిషేధించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంచితే, ఈ సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న అవాంతరాల పట్ల అమితాబ్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం నిజంగా ప్రజాస్వామ్యంలో వున్నామా? లేక నియంతృత్వంలో వున్నామా? అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సృజనాత్మక స్వేచ్చను అడ్డుకోవడం దురదృష్టమని ఆయన అన్నారు.