లారెన్స్ తో లక్ష్మీరాయ్ ప్రేమాయణం! :CineJwala Telugu:

Posted on

'ఆ వార్తలు వింటుంటే నాకు తెగ నవ్వొస్తోంది' అంటోంది కథానాయిక లక్ష్మీరాయ్. ఇంతకీ ఏమిటా వార్తలంటే... దర్శకుడు లారెన్స్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాగిస్తోందంటూ ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలే! ఈమధ్య విడుదలైన 'కాంచన' సినిమా షూటింగ్ టైం లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారంటూ కోలీవుడ్ మీడియా బాగా రాసింది. అందరికీ కన్నుకుట్టేలా సెట్స్ లో భార్యాభర్తల్లా కూడా మెలిగారని పుకార్లు వచ్చాయి.
                 ఈ విషయమే ఆమె వద్ద ప్రస్తావిస్తే, నవ్వుతూ వాటిని కొట్టిపారేస్తోంది. తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనీ, అందుకే అందరూ అలా అనుకుంటున్నారనీ అంటోంది. ఇదిలా ఉంచితే, లారెన్స్ కష్టజీవనీ, మానవత్వం వున్నవాడనీ, దైవభక్తి గలవాడనీ... లక్ష్మీరాయ్ అతనికి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తోంది. తెలుగులో తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ సరసన కీర్తి కంబైన్స్ సినిమాలో నటించింది.