నాగార్జునని మరచిపోలేకపోతున్న కథానాయిక :CineJwala Telugu:

Posted on

హీరో నాగార్జునని మరచిపోలేకపోతున్నానంటోంది బాలీవుడ్ భామ ఆయేషా టకియా. గతంలో ఆయేషా తెలుగులో 'సూపర్' సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. "సౌత్ లో నేను చేసిన ఒకే ఒక సినిమా సూపర్. తీయని అనుభూతినిచ్చిన సినిమా అది. అందుకే ఆ సినిమానీ, నాగ్ నీ కూడా మరచిపోలేకపోతున్నా"నని ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. "అసలు సౌత్ హీరోలందరిలోకీ నాగార్జున మంచి రొమాంటిక్ ఫిగర్. అలాంటి హీరోతో చేయగలగడం నా అదృష్టం. మళ్లీ చాన్స్ వస్తే తెలుగులో వెంటనే ఒప్పేసుకుంటాను" అంటూ తెలుగు సినిమానీ, నాగార్జుననీ ఈ అమ్మడు పొగడ్తలతో ముంచెత్తేస్తోంది. హీరోయిన్లని గౌరవించడంలో సౌత్ సినిమానే ముందుందని ఆయేషా చెబుతోంది.