హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెకు తెలంగాణ నేతకాండ్ల సంఘం మద్దతు తెలిపింది. ఈ మేరకు నేతన్నలు విలేఖరులతో మాట్లాడారు. వలస పాలకుల వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ కోసం చేస్తున్న సకల జనుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, హాజరయ్యారు. పంద్రాగస్టు రోజు అయిన సోమవారం జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఎగర వేయాలని ఆయన ప్రజలకు , ఉద్యోగులకు సూచించారు.