అనంతపురం: సైనిక సేవాదళ్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు. వెయ్యి మందితో కూడిన ఈ దళం సీమాంధ్ర ప్రాంత ప్రజల కోసం పని చేస్తుందని ఆయన తెలిపారు. 14ఎఫ్ రద్దు వల్ల నష్టపోయేది ఉద్యోగులేనని ఆయన తెలిపారు. 14ఎఫ్ రద్దు వల్ల తెలంగాణ అంశానికి తెరపడినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రపతి చర్య ద్వారా ఐదో జొన్ లోని అభ్యర్థులు ఉద్యమానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని అన్నారు.