హజారేతో విభేదించిన జెపి :CineJwala Telugu:

Posted on

రాజమండ్రి: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారేను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది. లోక్‌పాల్ బిల్లు పైన ప్రముఖ సామాజిక సంస్కర్త అన్నాహజారేతో జెపి విభేదించారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన లోక్‌పాల్ బిల్లు ప్రభావవంతమైనదే అని ఆయన రాజమండ్రిలో అభిప్రాయపడ్డారు. సిబిఐ, ఎసిబిలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించని ప్రభుత్వం కొన్ని ప్రయివేటు కంపెనీలకు మాత్రం వేల కోట్ల నిధులు కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు.

అవినీతి ఆరోపణలు వచ్చిన వారు సుప్రీం కోర్టుకు వెళ్లి అప్పీలు పేరుతో కేసులు జాప్యం చేయడం తగదని జెపి అన్నారు. అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సమాజం నిలబడుతుందన్నారు. రైతులు ప్రకటించిన పంట విరామాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. పంట విరామం ప్రకృతి శాపం కాదన్నారు. అది పాలకుల పాపమే అని విమర్శించారు.